కుటుంబ కలహాల నేపథ్యంలో బావమరిది, మామపై దాడి చేసిన ఘటనపై బుధవారం కర్నూలు ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. జోహరాపురానికి చెందిన షేక్ రెహాన్ సోదరిని షేక్షావలి వివాహం చేసుకున్నాడు. ఇటీవల కుటుంబ వివాదాల కారణంగా భార్య పుట్టింటికి వెళ్లింది. దీంతో ఆగ్రహానికి గురైన షేక్షావలి అత్తగారింటికి వెళ్లి బావమరిది రెహాన్, మామతో గొడవకు దిగాడు. మాటామాట పెరగడంతో రెహాన్‌పై రాయితో దాడి చేయగా, అడ్డుకోబోయిన మామ కూడా గాయపడ్డాడు. బాధితుడు రెహాన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.