గోనెగండ్ల తహశీల్దార్ కార్యాలయం ముందు వేముగోడుకు చెందిన రైతు రాఘవేంద్ర పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రీ సర్వేలో తన పట్టా భూమిని ఇనాం భూమిగా మార్చారని, ఆరు నెలల నుంచి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో విసుగు చెంది ఈ పని చేసినట్లు ఆయన తెలిపారు. స్థానికులు సకాలంలో స్పందించి నీరు పోసి కాపాడటంతో ప్రమాదం తప్పింది. తనకు న్యాయం చేయాలని ఆయన కోరారు.