కర్నూలు: చికెన్ కోసం గొడవ.. ముగ్గురిపై కత్తి దాడి

4చూసినవారు
కర్నూలు: చికెన్ కోసం గొడవ.. ముగ్గురిపై కత్తి దాడి
కర్నూలు బూదూరు ప్రాంతంలో గురువారం చికెన్ కోసం చిన్న ఘర్షణ పెద్ద సమస్యగా మారింది. చికెన్ షాప్ వద్ద వరుసగా నిలబడడంలో వివాదం వచ్చింది. నరేష్ అనే యువకుడు గొడవ   చేస్తూ ముగ్గురు  వ్యక్తులపై చికెన్ కత్తితో దాడి చేశారు. దాడిలో విజయ్, చిన్న, గాబ్రేలు గాయపడ్డారు. పరిస్థితి విషమమైన విజయ్‌ను ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలించారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నరేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.