కర్నూలు: నా భర్తను కనిపెట్టండి.. భార్య ఆవేదన!

10చూసినవారు
కర్నూలు: నా భర్తను కనిపెట్టండి.. భార్య ఆవేదన!
దేవనకొండ మండలం బండగట్టుకు చెందిన కురువ ధర్మ, కురువ మౌనిక ప్రేమ వివాహం చేసుకున్నారు. వారం రోజుల తర్వాత ధర్మ కనిపించకుండా పోవడంతో మౌనిక తీవ్ర ఆందోళనకు గురైంది. భర్త ఆచూకీ తెలియకపోవడంతో, అతని ఇంటి ముందు కూర్చొని "నాకు న్యాయం చేయాలి, నా భర్తను కనిపెట్టండి" అని వేడుకుంటోంది. అయితే, ధర్మ తల్లిదండ్రులు ఆమెను ఇంట్లోకి అనుమతించడం లేదు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్