కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ, బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి సమగ్ర మ్యాపింగ్ నిర్వహించాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా, అనర్హుల వివరాలను తొలగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జూన్ 15 నుంచి జులై 14 వరకు సర్వే చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రజలు అవసరమైన పత్రాలు సిద్ధంగా ఉంచుకొని ఎన్నికల సిబ్బందికి సహకరించాలని కోరారు.