కర్నూలు: ట్రాఫిక్ నిబంధనలు పాటించండి – ప్రాణాలు కాపాడుకోండి

966చూసినవారు
కర్నూలు: ట్రాఫిక్ నిబంధనలు పాటించండి – ప్రాణాలు కాపాడుకోండి
కర్నూలు ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్ మాట్లాడుతూ, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు మంగళవారం కర్నూలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు. 'ట్రాఫిక్ మిత్ర' ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై వీడియోలు ప్రదర్శించి, ట్రాఫిక్ నియమాల ఆవశ్యకతను వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్