కర్నూలు: మహిళా పోలీసుల కోసం ఉచిత వైద్య శిబిరం

0చూసినవారు
కర్నూలు: మహిళా పోలీసుల కోసం ఉచిత వైద్య శిబిరం
కర్నూలు జిల్లా పోలీసు శాఖ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా మంగళవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించింది. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ముఖ్య అతిథిగా పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. మహిళా పోలీసు సిబ్బందికి రక్తపోటు, షుగర్, ఈసిజి, బిఎమ్‌డీ వంటి పరీక్షలు ఉచితంగా చేయించి, అవసరమైన మందులు పంపిణీ చేశారు. ఎస్పీ మహిళల ఆరోగ్యం, సాధికారతపై దృష్టి పెట్టాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్