ఆల్
ఇండియా లాయర్స్ యూనియన్ నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందుచూపు లేకపోవడం వల్లే పెట్రోల్ బంకుల్లో ఇంధన కొరత ఏర్పడిందని విమర్శించారు. సోమవారం కర్నూలు నగరంలో పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు భారీగా క్యూలలో నిలబడుతున్నారని, పెట్రోల్, డీజిల్ లభించక ఆటో డ్రైవర్లు, ఉద్యోగులు, వివిధ వృత్తులపై ఆధారపడే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. ప్రజల రోజువారీ పనులు వాహనాలపై ఆధారపడుతున్న నేపథ్యంలో ఇంధన కొరత కారణంగా జీవన విధానం దెబ్బతింటోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.