కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె. వెంకటేశ్వర్లు గురువారం డైట్ విభాగాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న ఆహార నాణ్యత, పరిశుభ్రతను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. వంటశాల పరిశుభ్రత, ఆహార తయారీ విధానాన్ని పరిశీలించి, వండిన ఆహారాన్ని రుచి చూసి నాణ్యతను పరీక్షించారు. రోగుల సహాయకులతో మాట్లాడి, భోజనం రుచి, సమయపాలన గురించి అడిగి తెలుసుకున్నారు.