కర్నూలు: శాఖాహారంతో ఆరోగ్యం – ధ్యానంతో ప్రశాంతత: ఎంపీ

6చూసినవారు
కర్నూలు నగరంలోని రాఘవేంద్ర నగర్‌లో బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మెగా శాఖాహార అవగాహన ర్యాలీని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, శాఖాహారాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితం సాధ్యమవుతుందని, రోజూ ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించడంతో పాటు ఒత్తిడి, ఆందోళన తగ్గి ఏకాగ్రత పెరుగుతుందని తెలిపారు. తాను కూడా ప్రతిరోజూ ధ్యానం చేస్తానని, మొదటిసారి ఎంపీగా పోటీ చేసిన సమయంలో ధ్యానం ద్వారానే ఒత్తిడిని అధిగమించి విజయం సాధించానని పేర్కొన్నారు.