కర్నూలు: డీఐజీ కార్యాలయంలో హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యాన శిక్షణ

3చూసినవారు
కర్నూలు: డీఐజీ కార్యాలయంలో హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యాన శిక్షణ
కర్నూలు రేంజ్ డీఐజీ కార్యాలయంలో పోలీసు అధికారులు, సిబ్బంది కోసం నిర్వహిస్తున్న హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ శిక్షణ మంగళవారం రెండో రోజుకు చేరుకుంది. రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు సూచనలు, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ ఆధ్వర్యంలో ఈ మూడు రోజుల శిక్షణ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు, సిబ్బంది యోగా ఆసనాలు, ప్రాణాయామం, ధ్యాన సాధన చేశారు. పోలీసు విధుల్లో ఎదురయ్యే ఒత్తిడి, మానసిక ఆందోళనలను తగ్గించడంలో యోగా, ధ్యానం ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్