కర్నూలు: హాస్టళ్లను నెట్ జీరో క్యాంపస్‌లుగా అభివృద్ధి చేయాలి

3చూసినవారు
కర్నూలు: హాస్టళ్లను నెట్ జీరో క్యాంపస్‌లుగా అభివృద్ధి చేయాలి
కర్నూలు జిల్లాలోని సంక్షేమ రెసిడెన్షియల్ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లను “నెట్ జీరో & హెల్తీ క్యాంపస్ లుగా అభివృద్ధి చేయడానికి సమగ్ర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఆదేశించారు. మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో, ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూల్స్‌ను నెట్ జీరో, హెల్తీ క్యాంపస్‌లుగా తీర్చిదిద్దే అంశంపై అధికారులకు సూచనలు చేశారు. నెట్ జీరో ఎనర్జీ, పచ్చదనం పెంపు, నీటి సంరక్షణ, కార్బన్ ఉద్గారాల తగ్గింపు లక్ష్యంగా చర్యలు చేపట్టాలని, మొదటి దశలో రెసిడెన్షియల్ స్కూల్స్‌లో, తదుపరి దశలో హాస్టళ్లలో ఈ ప్రక్రియ అమలు చేయాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్