కర్నూలు: పెట్రోల్, డీజిల్ కొరతపై తక్షణ చర్యలు తీసుకోవాలి

1932చూసినవారు
కర్నూలు జిల్లాలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ తీవ్ర కొరతను తక్షణమే నివారించాలని రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. జిల్లాలో పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొనడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతుల వ్యవసాయ పనులు, రవాణా వ్యవస్థ, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్రంగా ప్రభావితమవుతున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్