మాదకద్రవ్యాల బారిన పడకుండా యువతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు పిలుపునిచ్చారు. సోమవారం 5వ శానిటేషన్ డివిజన్ కార్యాలయం వద్ద ఈగల్ (ఎలైట్ యాంటీ-నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్) బృందం ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి వినియోగం, విక్రయం లేదా రవాణా జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని సూచించారు. మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.