కర్నూలు: సామూహికంగా తాళ్లతో ఉరివేసుకొని వినూత్నంగా నిరసన

2చూసినవారు
కర్నూలు: సామూహికంగా తాళ్లతో ఉరివేసుకొని వినూత్నంగా నిరసన
రాష్ట్రంలో ఎన్నికల హామీల మేరకు ఉద్యోగాలు లేదా నెలకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని, లేదంటే ఆత్మహత్యలే శరణ్యమని విద్యార్థి, యువజన సంఘాల నాయకులు కర్నూలు కలెక్టరేట్ ఎదుట శుక్రవారం వినూత్న నిరసన తెలిపారు. సామూహికంగా తాళ్లతో ఉరివేసుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాసులు, రెడ్డిపోగు ప్రశాంత్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్