కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, నియోజకవర్గ, మండల స్పెషల్ ఆఫీసర్లను ప్రతివారం తప్పనిసరిగా మండలాలకు వెళ్లి ఆస్పత్రులు, పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్వాడీ సెంటర్లు, సచివాలయాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆమె ఈ సూచనలు చేశారు. హాస్టళ్లలో తాగునీరు, పౌష్టికాహారం, టాయిలెట్లు, సీసీ కెమెరాలు, స్వచ్ఛత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అలాగే బీసీ హాస్టళ్లలో పదవ తరగతి ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు.