కర్నూలు: జగన్‌ ఇప్పటికైనా నిజాలు చెప్పడం నేర్చుకో: సోమిశెట్టి

3చూసినవారు
కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు బుధవారం కర్నూలులో మాట్లాడుతూ, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిజాలు చెప్పడం నేర్చుకోవాలని అన్నారు. గత ఎన్నికల్లో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన చరిత్ర జగన్‌కే చెందుతుందని విమర్శించారు. వైఎస్సార్ కుటుంబం హత్యలతో ముడిపడి ఉందని, ప్రజలు నిజానిజాలు గుర్తించి వైసీపీకి తగిన బుద్ధి చెప్పారని ఆయన ఆరోపించారు.