కర్నూలు: దళిత మహిళ హత్య కేసులో న్యాయం చేయాలి

7చూసినవారు
దళిత మహిళపై జరిగిన పాశవిక అత్యాచారం, హత్య ఘటనలో పోలీసులు రేప్ అండ్ మర్డర్ కేసు నమోదు చేయకపోవడం అన్యాయమని కెవిపిఎస్, ఐద్వా నాయకులు విమర్శించారు. కర్నూలులో శనివారం జరిగిన సమావేశంలో, కేవలం 304/2 బీఎన్‌ఎస్ సెక్షన్ నమోదు చేయడం వివక్షతో కూడుకున్నదని వారు ఆరోపించారు. వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, అత్యాచారం, హత్య కేసులు నమోదు చేసి, లోతైన విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్