ఐటీడీపీ నాయకుడు గట్టు తిలక్ వేధింపుల కారణంగా సతీష్ ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నూలుకు చెందిన సతీష్ కుటుంబాన్ని మాల మహానాడు, సంక్షేమ ఐక్య వేదిక నాయకులు మంగళవారం పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యం వల్లే ఈ అన్యాయం జరిగిందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సతీష్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.