విజ్ఞానం విశ్వజనీయమైనదని విజ్ఞానచింతన పరిశోధకులు మాజీ ప్రొఫెసర్ దేవరాజు మహారాజు అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని స్థానిక డిఎఎస్ కళ్యాణ మండపంలో నిర్వహించిన విద్యారంగం వైజ్ఞానిక దృక్పథం సదస్సుకు ఆయన ముఖ్య వక్కగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సమాజ అభివృద్ధికి సైన్సు ఎంతో తోడ్పాటు నిస్తుందన్నారు. సైన్సు వాస్తవాలకు అడ్డం పడుతుందన్నారు.