తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం ఈసారి ప్రత్యేక పరిస్థితుల్లో వర్చువల్ విధానంలో బుధవారం ప్రారంభమైంది. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ, రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌తో కలిసి కర్నూలు నియోజకవర్గంలోని 5వ క్లస్టర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ విధానాలు, భవిష్యత్ కార్యాచరణ, అభివృద్ధి కార్యక్రమాలపై జరిగిన చర్చలను వీక్షించారు. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై నాయకులు చర్చించారు.