కర్నూలు: పారిశుద్ధ్య పనుల్లో అలసత్వం పనికిరాదు

7చూసినవారు
కర్నూలు: పారిశుద్ధ్య పనుల్లో అలసత్వం పనికిరాదు
కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య పనుల నిర్వహణలో ఎలాంటి అలసత్వం పనికిరాదని కమిషనర్ చల్లా ఓబులేసు స్పష్టం చేశారు. బుధవారం కొండారెడ్డి బురుజు వద్ద 1వ శానిటేషన్ డివిజన్‌లో మస్టర్ తనిఖీ నిర్వహించి, ఆనంద్ టాకీస్, సంతోష్ నగర్, ముజఫర్ నగర్ ప్రాంతాల్లో స్వచ్ఛత పనులను పరిశీలించారు. డ్రైనేజీ కాలువల్లో వ్యర్థాలు వేయడం తీవ్ర నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విధుల్లో యూనిఫాం తప్పనిసరిగా ధరించాలని, కార్మికులకు అవసరమైన హెల్త్ సేఫ్టీ కిట్లు, పనిముట్లు వెంటనే అందించాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్