కర్నూలు: ట్రాన్స్ జెండర్ల హక్కులపై న్యాయ విజ్ఞాన సదస్సు

15చూసినవారు
కర్నూలు: ట్రాన్స్ జెండర్ల హక్కులపై న్యాయ విజ్ఞాన సదస్సు
కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సోమవారం న్యాయ సేవ సదన్‌లో ట్రాన్స్‌జెండర్ల హక్కులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేందుకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి, అధ్యక్షులు జి. కబర్థి, కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి పాల్గొన్నారు. జిల్లా జడ్జి మాట్లాడుతూ, ట్రాన్స్ జెండర్ పర్సన్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్) యాక్ట్, 2019 చట్టంలోని ముఖ్య అంశాలను వివరించారు.

సంబంధిత పోస్ట్