కర్నూలు: అణగారిన వర్గాలకు చేరువగా న్యాయ సేవలు

1చూసినవారు
కర్నూలు: అణగారిన వర్గాలకు చేరువగా న్యాయ సేవలు
సోమవారం కర్నూలులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ సేవల వాహనాన్ని ప్రారంభించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కబర్థి ఈ వాహనాన్ని ప్రారంభించి, ప్రజలకు న్యాయ అవగాహన, న్యాయ సహాయం, హక్కులపై చైతన్యం కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాగూర్ ఆదేశాల మేరకు ప్రతి జిల్లాకు ఒక న్యాయ సేవల వాహనం అందించబడిందని వివరించారు. అణగారిన వర్గాలకు న్యాయ సేవలను మరింత చేరువ చేయడమే ఈ కార్యక్రమ లక్ష్యం.

సంబంధిత పోస్ట్