తెలుగుదేశం పార్టీ మహిళా సాధికారతకు కట్టుబడి ఉందని, రానున్న ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేస్తోందని
టీడీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ తెలిపారు. ఈనెల 27, 28 తేదీల్లో జరిగిన మహానాడులో మహిళా రిజర్వేషన్లపై తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ, కర్నూలులోని
టీడీపీ కార్యాలయంలో
ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, మహిళా నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. మహిళా సాధికారతను మాటల్లో కాకుండా చేతల్లో చూపిన పార్టీ టీడీపీయేనని, రాజకీయ, ఆర్థిక, సామాజికంగా ప్రాధాన్యత కల్పించడంలో
టీడీపీ ముందుందని ఆమె పేర్కొన్నారు.