కర్నూలు అబ్బాస్ నగర్‌కు చెందిన పి. రహీమా ఖాన్ (39) మెకానిక్‌గా జీవించేవారు. ఏడు నెలల క్రితం లక్ష రూపాయలు అప్పుచేసి ఆపిల్ ఫోన్ కొనుగోలు చేశారు. అప్పు ఇచ్చిన వ్యక్తి ఒత్తిడి చేయడంతో మానసికంగా కుంగిపోయి ఈ నెల 4న క్రిమిసంహారక మందు మింగారు. కుటుంబసభ్యులు గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోంది.