కనీస వేతనం అమలు చేయాలని, ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షురాలు పి. రుద్రమ్మ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో, జిల్లా కార్యదర్శి ఎస్. ఉమాదేవి మాట్లాడుతూ, ఆర్పీలు వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారికి తగిన పారితోషికం అందకపోవడం అన్యాయమని అన్నారు.