ఆశావర్కర్లకు కనీస వేతనం రూ. 26 వేలు అమలు చేయాలని సీఐటీయూ కర్నూలు నగర ప్రధాన కార్యదర్శి విజయ రామాంజనేయులు బుధవారం డిమాండ్ చేశారు. ఎర్రబురుజు అర్బన్ హెల్త్ సెంటర్‌లో మెడికల్ ఆఫీసర్‌కు వినతి పత్రం సమర్పిస్తూ, పని ఒత్తిడి తగ్గించాలని, రాజకీయ జోక్యం నివారించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆశావర్కర్లు పాల్గొన్నారు.