కర్నూలు: మాక్ డ్రిల్ ను సక్రమంగా ప్రమాణాలతో నిర్వహించాలి

485చూసినవారు
కర్నూలు: మాక్ డ్రిల్ ను సక్రమంగా ప్రమాణాలతో నిర్వహించాలి
ఆకస్మిక ప్రమాదాలపై తీసుకునే చర్యలను పటిష్టంగా అమలు చేయాలని, ఈనెల 30న నిర్వహించనున్న మాక్ డ్రిల్‌ను సక్రమంగా, ప్రమాణాలతో నిర్వహించాలని రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎండి ప్రఖర్ జైన్ కర్నూలు జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న మాక్ ఎక్సర్సైజ్ ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రమాదం సంభవించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం వేగంగా చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదాల నివారణకు, తక్షణ స్పందనకు ఈ మాక్ డ్రిల్ ఎంతో కీలకం అని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్