జాతీయస్థాయి ట్రెడిషనల్ ఆర్చరీ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 30 మంది క్రీడాకారులు పాల్గొని 7 బంగారు, 6 సిల్వర్, 10 కాంస్య పతకాలు సాధించారు. శుక్రవారం కర్నూలులో క్రీడాకారులను డీఐజీ, కర్నూలు ఇన్‌చార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు. గోల్డ్ మెడల్స్ సాధించిన క్రీడాకారులు రాష్ట్రానికి గర్వకారణమని, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రెడిషనల్ ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ వేణుగోపాల్ రెడ్డి, తల్లిదండ్రులు, ఎస్సై శ్రీనివాసు, కానిస్టేబుల్ మాధవి పాల్గొన్నారు.