కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి బుధవారం కలెక్టరేట్ కాంప్లెక్స్‌లోని ఈవీఎం గోడౌన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, ఈవీఎంల భద్రత విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. గోడౌన్‌లో భద్రపరిచిన ఈవీఎం యంత్రాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ, ఎంట్రీ–ఎగ్జిట్ రిజిస్టర్ల నిర్వహణను క్షుణ్ణంగా తనిఖీ చేసి, అధికారులకు సూచనలు జారీ చేశారు. ఎన్నికల సామగ్రి భద్రత అత్యంత కీలకమని, దానిలో ఎటువంటి లోపాలు చోటుచేసుకోకూడదని ఆమె పేర్కొన్నారు.