కర్నూలు: ఎన్‌టీఏ, నీట్ వ్యవస్థలను రద్దు చేయాలి: ఎస్ఎఫ్ఐ

6చూసినవారు
కర్నూలు: ఎన్‌టీఏ, నీట్ వ్యవస్థలను రద్దు చేయాలి: ఎస్ఎఫ్ఐ
కర్నూలు ఎస్ఎఫ్ఐ నాయకులు ఎన్‌టీఏ, నీట్ వంటి కేంద్ర పరీక్షా వ్యవస్థలను రద్దు చేసి విద్యార్థుల జీవితాలను కాపాడాలని డిమాండ్ చేశారు. విద్యా కేంద్రీకరణకు వ్యతిరేకంగా జూన్ 3 నుంచి 6 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించే నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం జరిగిన జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో, నీట్, సీయూసెట్, యూజీసీ నెట్ పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, పేపర్ లీకులు, అవకతవకలతో విద్యార్థులు నష్టపోతున్నారని నాయకులు విమర్శించారు.

సంబంధిత పోస్ట్