ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా గురువారం కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం మే 28ను రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది. సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ ఎం. మహేష్ కుమార్
ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.