కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి
ఎన్టీఆర్ చేసిన సంక్షేమ కార్యక్రమాలను, మహిళలకు సమాన హక్కులు, రిజర్వేషన్లు కల్పించడంలో ఆయన పాత్రను కొనియాడారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించాలని డిమాండ్ చేశారు.