కర్నూలు: ఓలా సేవల్లో లోపం.. రూ. 55 వేల జరిమానా

0చూసినవారు
కర్నూలు: ఓలా సేవల్లో లోపం.. రూ. 55 వేల జరిమానా
కర్నూలు జిల్లా వినియోగదారుల కమిషన్, ఓలా సంస్థ సేవల్లో లోపం ఉందని నిర్ధారించి, ఫిర్యాదుదారు ఉల్లాజీ చెన్నమ్మకు రూ. 50 వేల నష్టపరిహారం, రూ. 5 వేల కోర్టు ఖర్చులు చెల్లించాలని మంగళవారం ఆదేశించింది. అక్టోబర్ 11, 2025న పరీక్షకు వెళ్లేందుకు ఓలాలో ఆటో బుక్ చేసుకున్న చెన్నమ్మ, ఆమె తల్లిని డ్రైవర్ మార్గమధ్యంలో వదిలివేయడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భద్రమైన సేవలు అందించడం సంస్థ బాధ్యత అని కమిషన్ పేర్కొంది.

ట్యాగ్స్ :