రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంచేందుకు ప్రభుత్వం ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. శనివారం కర్నూలు నగరంలో సీడీఎంఏ పి. సంపత్ కుమార్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కలిసి డ్రైనేజీ కాలువ, సుద్దవాగులో పూడికతీత, పారిశుద్ధ్య పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.