కర్నూలు: యువత నైపుణ్యాలు పెంచుకుంటే అవకాశాలు అందివస్తాయి

346చూసినవారు
కర్నూలు: యువత నైపుణ్యాలు పెంచుకుంటే అవకాశాలు అందివస్తాయి
కర్నూలు జిల్లా యువజన సంక్షేమ శాఖ సెట్కూరు ఆధ్వర్యంలో సర్వోదయ ఐటీఐ కళాశాలలో “వ్యక్తిత్వ వికాసం - ఉపాధి అవకాశాలు” అనే అంశంపై అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సెట్కూరు సీఈఓ డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ, మారుతున్న ప్రపంచంలో కేవలం డిగ్రీలు సరిపోవని, విజయం సాధించాలంటే నైపుణ్యాలు అవసరమని, ఇవి ఉద్యోగానికి సంబంధించిన సామర్థ్యాలతో పాటు ఆలోచన, ప్రవర్తన, పనితీరు, భవిష్యత్తును ప్రభావితం చేస్తాయని వివరించారు. యువత తమ అపారమైన శక్తిని సరైన దిశలో వినియోగించుకుంటే ఎలాంటి అడ్డంకులైనా అధిగమించవచ్చని ఆయన పేర్కొన్నారు.