కర్నూలు: ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల బ్యాగ్ చోరీ

8చూసినవారు
కర్నూలు: ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల బ్యాగ్ చోరీ
కర్నూలు ఆర్టీసీ బస్టాండ్‌లో దొంగతనాలు పెరిగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పోలీసు గస్తీ తగ్గడం, సీసీ కెమెరాలు సరిగా పనిచేయకపోవడంతో దొంగలు పట్టపగలే దోపిడీలకు పాల్పడుతున్నారు. రద్దీని అదునుగా తీసుకుని బస్సుల్లో ఎక్కుతున్నట్లు నటిస్తూ బ్యాగులు, నగలు అపహరిస్తున్నారు. ఆదివారం శారద–రాజశేఖరరెడ్డి దంపతులకు చెందిన బ్యాగు చోరీకి గురైంది. అందులో 10 తులాల బంగారం, సెల్‌ఫోన్ ఉన్నాయని బాధితులు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్