కర్నూలు జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఆయన చిత్రపటానికి కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, జిల్లా అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేశారు. ‘మై భారత్ సెంటర్’ ఆధ్వర్యంలో సర్దార్ 150 యూనిటీ మార్చ్, యువత కోసం క్విజ్, వ్యాసరచన పోటీలు అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25 వరకు నిర్వహించబడతాయని తెలిపారు.