మార్చి మాసంలో కర్నూలు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అర్హులైన 2 లక్షల 36 వేల 152 మంది లబ్ధిదారులకు రూ. 103.86 కోట్లు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. శనివారం మద్దూర్ నగర్ లోని అమ్మ వృద్ధుల శరణాలయంలో కలెక్టర్ పలువురికి పెన్షన్లు అందజేశారు. వీరిలో లక్ష్మికి వితంతు పెన్షన్, లక్ష్మీదేవి, అంబు, కృష్ణమ్మ, సర్వేశ్వరమ్మ, సంజమ్మలకు వృద్ధాప్య పెన్షన్, శశికళ, నాగవేణి, ఈశ్వరమ్మలకు వైకల్య పెన్షన్లు ఉన్నాయి.