కర్నూలు జిల్లాలో అర్హులైన లబ్ధిదారుల ఇంటికే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. మే మాసంలో మొత్తం 2,35,260 మంది లబ్ధిదారులకు రూ.103.90 కోట్ల పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. శుక్రవారం లేబర్ కాలనీలో కలెక్టర్ స్వయంగా వృద్ధాప్య, వైకల్య, వితంతు పెన్షన్లు లబ్ధిదారులకు అందజేశారు. వారితో ఆత్మీయంగా మాట్లాడుతూ వారి యోగక్షేమాలను, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.