కర్నూలు: సంక్రాంతి వేళ పందెంలకు దూరంగా ఉండాలి: డీఐజీ

14చూసినవారు
కర్నూలు: సంక్రాంతి వేళ పందెంలకు దూరంగా ఉండాలి: డీఐజీ
సంక్రాంతి పండగల సందర్భంగా పందెం రాయుళ్లకు డీఐజీ, కర్నూలు ఇన్‌చార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరికలు జారీ చేశారు. పేకాట, జూదం, కోడి పందెంలు, గుండాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో చట్టవ్యతిరేక ఆటలను నిషేధించినట్లు తెలిపారు. అటువంటి కార్యకలాపాలు ఎక్కడ జరిగినా డయల్ 112, 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.

ట్యాగ్స్ :