కర్నూలు: DMHO కారుకు అడ్డుపడి నిరసన

1చూసినవారు
కర్నూలు జిల్లా కోసిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సరైన వైద్య సేవలు అందడం లేదని, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఓ బాధితుడు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. జిల్లా వైద్యాధికారి (DMHO) కామేశ్వర ప్రసాద్ తనిఖీకి వచ్చినప్పుడు, ఆ బాధితుడు తన వాహనానికి అడ్డంగా రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశాడు.