అర్జీదారుల సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు. అధికారులు నిర్లక్ష్యం వహించకూడదని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.