ప్రజల రాజుగా ఖ్యాతి పొందిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు సేవలు చిరస్మరణీయమని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్, అధికారులు రాజా వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రముఖ జమీందార్లలో వెంకటాద్రి నాయుడు ఒకరని, ఆయన 1761 ఏప్రిల్ 27న జన్మించి, 1783లో పట్టాభిషేకం పొంది, గుంటూరు జిల్లాలోని అమరావతి కేంద్రంగా సుమారు 500 గ్రామాలపై పరిపాలన సాగిస్తూ న్యాయం చేశారని కలెక్టర్ కొనియాడారు.