కర్నూలు: జిల్లాలో మహిళల భద్రత మనందరి బాధ్యత: జిల్లా ఎస్పీ

7చూసినవారు
మహిళల భద్రతపై అవగాహన పెంచడం ద్వారా నేరాలను తగ్గించవచ్చని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం ఆలూరు మండల కేంద్రంలో జరిగిన అవగాహన సదస్సులో పేర్కొన్నారు. మహిళల రక్షణకు పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని, సమస్యలు ఎదురైనప్పుడు సంకోచం లేకుండా సంప్రదించాలని సూచించారు. చట్టాలపై అవగాహన పెరిగితేనే నేరాలు తగ్గుతాయని, పోక్సో, బాల్య వివాహాల నిషేధ, నిర్భయ చట్టాలు మహిళలకు రక్షణ కల్పిస్తున్నాయని ఆయన వివరించారు.

ట్యాగ్స్ :