దళిత క్రైస్తవులను ఎస్సీలుగానే కొనసాగించాలనే ఉద్యమానికి కెవిపిఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మంగళవారం కర్నూలు నగరంలో దళిత క్రైస్తవులు నిర్వహించిన నిరసన ప్రదర్శనలో కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. డి. ఆనంద్ బాబు పాల్గొన్నారు. విశ్వాసం మారినంత మాత్రాన కులం మారదని, దళితులకు రాజ్యాంగపరమైన హక్కులు నిరాకరించడం అన్యాయమని ఆయన అన్నారు. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌ను సవరించి, క్రైస్తవ మతాన్ని స్వీకరించిన దళితులకు కూడా ఎస్సీ హోదా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు విజయమ్మ, యేసు రాజు, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.