కర్నూలులోని కప్పల్‌నగర్ చైతన్య స్కూల్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా విద్యార్థినులకు భద్రత, ఆత్మరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బుధవారం కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా మాట్లాడుతూ ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, పట్టుదలతో లక్ష్యాలు సాధ్యమని తెలిపారు. కరాటే మాస్టర్లు ఆత్మరక్షణ టెక్నిక్స్ ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు.