కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన పదిమంది వార్డు సచివాలయ ఉద్యోగులకు కమిషనర్ చల్లా ఓబులేసు గురువారం షాక్ ఇచ్చారు. కర్నూలు 16, 17, 43వ వార్డు సచివాలయాల్లో అలసత్వం ప్రదర్శించిన ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్, ఉన్నతాధికారులు బుధ, గురువారాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు నిర్వహించిన సందర్భంగా, మంత్రికి స్థానికులు వార్డు సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని ఫిర్యాదు చేశారు. పని వేళల్లో గైర్హాజరైన ఉద్యోగులను ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదని తెలిసింది.