కర్నూలు: పదవీవిరమణ పొందిన పోలీసులకు ఎస్పీ సన్మానం

2చూసినవారు
కర్నూలు: పదవీవిరమణ పొందిన పోలీసులకు ఎస్పీ సన్మానం
కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం సుదీర్ఘకాలం పోలీసుశాఖలో సేవలందించి పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులను ఘనంగా సన్మానించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ, సేవా భావంతో పనిచేసి పదవీ విరమణ పొందడం అభినందనీయమని తెలిపారు. కర్నూలు డిటిసి ఎస్సై జి. మల్లికార్జున, ఆదోని పిసిఆర్ ఎస్సై కె. పి. ప్రహల్లాద, కర్నూలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ బి. రంగడు పదవీ విరమణ పొందారు. వారికి శాలువాలు, పూలమాలలు వేసి సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్